బీజేపీలోకి సోమారపు సత్యనారాయణ
టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ బీజేపీలో చేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మాజీ మంత్రి దత్త్తాత్రేయ సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ ండువా కప్పి ఆయన్ను ఆహ్వానించారు. ఆయన ఇటీవల టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం విదితమే. సోమారపుతోపాటు ఆయన కుమారుడు, కోడలు, పలువురు కార్పొరేటర్లు, టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేశారు. ఈ సందర్భంగా సోమారపు మాట్లాడుతూ టీఆర్ఎస్ గెలుపునకు, పటిష్ఠానికి పనిచేసిన తనకు ఇటీవల ఎన్నికల్లో ఓడిపోయాక అవమానాలు ఎదురయ్యాయని, తన స్వేచ్ఛకు భంగం వాటిల్లిందని వాపోయారు. దేశానికి సేవ చేసే భాగ్యం కలుగుతుందన్న భావనతో తాను బీజేపీలో చేరానన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు బండి సంజయ్, అర్వింద్, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్రావు, ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు.













