రాములోరి కళ్యాణం చూడండి…
భద్రాచలంలో రాములోరి కల్యాణం ఈ ఏడాది అత్యంత ప్రతిషా’త్మకంగా జరగనున్నది. సీతారామచంద్రుడు విళంబినామ సంవత్సరంలోనే జన్మించాడని, ఈ ఏడాది కూడా విళంబి నామ సంవత్సరమే కావడం శుభసూచకమని, కల్యాణాన్ని వీక్షిస్తే శుభం జరుగుతుందని విస్తతంగా ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఈ ఏడాది కల్యాణానికి లక్షమందికి పైగా భక్తులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అయితే కల్యాణ వేడుకంతా గతానికి భిన్నంగా పూర్తిగా నిఘా నీడలోనే జరిగేలా ఏర్పాట్లు చేస్తుండటం గమనార్హం. సెక్టార్లను విభజించి అందుకు అనుగుణంగా ఉన్నత స్థాయి అధికారిని ఆ సెక్టార్కు బాధ్యుడుగా చేస్తూ నియమించనున్నారు. 40కి పైగా సిసి కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. స్పెషల్ బ్రాంచ్, ఇంటిలిజెన్స్ సిబ్బందిని కూడా అధిక మొత్తంలో ఈ సారి వినియోగించుకోనున్నారు.













