బ్రిక్స్ యూత్ సమ్మిట్‌కు హెచ్‌సీయూ విద్యార్థిని

మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్ అండ్ స్పోర్ట్స్ ఆధ్వర్యంలో ఈ నెల 22 నుంచి 26 వరకు రష్యాలో జరుగుతున్న బ్రిక్స్ ( బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా) ఐదు రోజుల యూత్ సమ్మిట్‌లో మనదేశం తరపున ప్రాతినిధ్యం వహించే బృందంలో హెచ్‌సీయూ విద్యార్థిని అయేషాకు చోటు దక్కింది. అసమానతలు లేని ప్రపంచ అభివృద్ధి, భద్రత, సమానత్వం, సహకారం, రక్షణ తదితర అంశాల్లో పరస్పర సహకారం కోసం నిర్వహించే బ్రిక్స్ సదస్సులో ఆయా దేశాలకు చెందిన యువత ప్రతినిధులుగా హాజరవుతారు. అయేషా హెచ్‌సీయూ స్కూల్ ఆఫ్ కెమిస్ట్రీలో ప్రొఫెసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పీహెచ్‌డీ చేస్తున్నారు.