షాదీఖాన భవనాన్ని ప్రారంభించిన మంత్రి కేటీఆర్
రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటించారు. జిల్లాలోని తంగళ్లపల్లి మండలం, జిల్లెల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే గ్రామంలో నిర్మించిన పల్లె దవాఖానను ప్రారంభించారు. అనంతరం సిరిసిల్ల పట్టణ పరిధిలో నిర్మించిన షాదీఖాన భవనాన్ని ప్రారంభించారు. పట్టణంలోని రగుడు జంక్షన్ అభివృద్ధి, సుందరీకరణ మరియు బైపాస్ రోడ్ సెంట్రల్ లైటింగ్ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.













