జులై 25న ఉజ్జయిని మహంకాళి… బోనాలు

జులై 25, 26 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయని ఆలయ కమిటీ ప్రకటించింది. 25న బోనాలు, 26న రంగం కార్యక్రమం నిర్వహిస్తామని ఆలయ కమిటీ ప్రకటించింది. 26న ఏనుగుపై అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం మాత్రమే బోనాల జాతర నిర్వహించనున్నారు.