ఆ ముగ్గురు మంత్రులకు ఊరట
తెలంగాణ ఉద్యమ సమయంలో మౌలాలి దగ్గర రైల్ రోకో కేసులో సికింద్రాబాద్ రైల్వే కోర్టు తీర్పు ప్రకటించింది. మంత్రులు కేటీఆర్, నాయిని, పద్మారావు సహా 14 మందిపై నమోదైన కేసును కొట్టివేసింది. 2011లో వీరిపై సికింద్రాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. రైళ్ల రాకపోకలను అడ్డుకోవడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించడంతో వారిపై కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి సికింద్రాబాద్లో రైల్వే కోర్టులో విచారణ జరిగింది. ఈ కేసుకు సంబంధించి గతంలో వారు చాలా సార్లు కోర్టుకు హాజరయ్యారు. వాదోపవాదనలు విన్న తర్వాత న్యాయస్థానం 14మందిపై కేసును కొట్టివేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. దాదాపు పదేళ్లపాటు ఈ కేసు విచారణ జరిగింది.













