థీమ్ పార్క్‌ను సందర్శించిన సేఫ్ వాటర్ నెట్వర్క్ ప్రతినిధులు
నగర వాసుల్లో నీటి ఆవశ్యకతను తెలియజేసేందుకు జలమండలి ఏర్పాటు చేసిన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ థీమ్ పార్క్‌ను అమెరికాకు చెందిన సేఫ్వాటర్ నెట్వర్క్ ఢిల్లీ ప్రతినిధులు సందర్శించారు. మంచి నీటి విలువ తెలిపేందుకు థీమ్ పార్క్ ఎంతో దోహదం చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు. అంతకు ముందు వీరు జలమండలి ఎండి దానకిషోర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. నీటి వృథాను అరికట్టేందుకు జలమండలి చేపడుతున్న వాక్ కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతామని ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవ్వాటర్ నెట్ వర్క్ ప్రధాన కార్యాలయ ప్రతినిధి టామ్ క్రెస్, ఢిల్లీ ప్రతినిధులు చారులాల్, ఆనంద్ రుద్ర, రవి సేవక్, పూనం సేవక్, వేణు రాచూర్, శంకర్ బట్రా తదితరులు పాల్గొన్నారు.













