అమెరికాలో సూర్యాపేట జిల్లా వాసి మృతి
అమెరికాలోని ఒహియో స్టేట్లో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా మరొకరు బ్రెన్డెన్ అయ్యారు. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలోని సూర్యపేట జిల్లా కేంద్రానికి నరేంద్రుని లింగమూర్తి, సుధారాణి దంపతులు కుమారుడు చిరుసాయి (22) ఎంఎస్ కోసం జనవరిలో అమెరికాలో ఓహియోకు వెళ్లాడు. ఈ నెల 9న మొదటి సంవత్సరం సెమిస్టర్ పరీక్షలు పూర్తి చేశాడు. డిసెంబర్ 15న స్వదేశానికి తిరిగి వచ్చేందుకు విమాన టికెట్ బుక్ చేసుకున్నాడు. షాపింగ్ చేసి తల్లిదండ్రుల కోసం కొత్తబట్టలు కూడా కొన్నాడు. ఈ విషయాన్ని అమ్మనాన్నలతో పంచుకున్నాడు, తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు సహచర విద్యార్థులతో కలిసి షాపింగ్ చేసిన సాయి ప్రయాణిస్తున్న కారును ఓ టిప్పర్ వెనుక నుంచి ఢీకొట్టింది. తీవ్రంగా కురుస్తున్న మంచు కారణంగా వేగంగా వచ్చిన టిప్పర్ కారును ఢీకొంది. ఆ ప్రమాదంలో చిరు సాయి అక్కడిక్కడే మృతి చెందాడు. నల్లగొండకు చెందిన సహా విద్యార్థిని బ్రెయిన్ డెడ్ అయినట్లు సమచారం. మరో ఇద్దరు స్నేహితులు తీవ్రంగా గాయపడ్డారు.













