కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. వారిని ఆదుకుంటాం : రేవంత్
రాష్ట్రంలో పేదలు బతికే పరిస్థితి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వారిని ఆదుకుంటామని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గం జవహర్‌నగర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు మేడ్చల్‌కు తెస్తామన్న ఐటీ పార్కు ఎక్కడికి పోయిందని ప్రశ్నించారు. జవహర్‌నగర్‌లో డంపింగ్ యార్డు విషయంలో కోర్టుకు వెళ్లి ఆదేశాలు తీసుకొచ్చినా తరలించలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పేదలను ఆదుకుంటాం. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2,500 అందజేస్తాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తాం. పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం. కాంగ్రెస్ హయాంలో రూ.400 ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.1200కి చేరింది అని అన్నారు.













