బీఆర్ఎస్ చేసిందేమీ లేదు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదే స్టేషన్ ఘన్‌పూర్‌కు రెండు పనులు చేయించే బాధ్యత తాను తీసుకుంటానని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌లో నిర్వహించిన కాంగ్రెస్ విజయభేరి సభలో రేవంత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్ ఘన్‌పూర్‌కు వంద పడకల ఆస్పత్రి, డిగ్రీ కాలేజీ తీసుకొస్తామన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మంత్రివర్గంలో నలుగురు మహిళలకు స్థానం కల్పిస్తామన్నారు. బిల్లులు రావడం లేదని సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకుంటామని అంటున్నారు.
ఆంధ్రాలో అధికారం కోల్పోతామని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం, ఈ బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇక కాంగ్రెస్ విజయం ఖాయం. కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అవుతుందని బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. కాంగ్రెస్ వస్తే రైతులతో పాటు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు. ఉపాధి హామీ కూలీకి వెళ్లే ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ.12 వేలు ఇస్తాం. 2004లో రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి రాగానే 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్, ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తాం అని అన్నారు.













