తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా రామచంద్రరావు
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ హిమాకోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నందున, రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక చీఫ్ జస్టిస్‌గా ఎంఎస్ రామచందర్‌రావు నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి ఉత్తర్వులిచ్చారు. 2012 జూన్ 29 నుంచి హైకోర్టు న్యాయమూర్తిగా పని చేస్తున్న ఆయన సీనియార్టీలో రెండో స్థానంలో ఉన్నారు. 1966 ఆగస్టు 7న హైదరాబాద్‌లో రామచంద్రరావు జన్మించారు. 1989లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. 1991లో కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. తర్వాత హైకోర్టు న్యాయవాదిగా, ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా పలు కీలక కేసుల్ని వాదించారు.













