28న బీజేపీలోకి కోమటిరెడ్డి ?
మునుగోడు ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారా? అయినతో పాటు మరికొంతమంది నాయకలు కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? పరిస్థితలు చూస్తూంటే అవుననే అనిపిస్తోంది. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడు ఢిల్లీ వెళ్లారు. అక్కడ బీజేపీ కీలక నేతలతో భేటీ కానున్నారు. తనతో పాటు బీజేపీలో చేరునున్న నేతల వివరాలను కూడా తనతో పాటు తీసుకెళ్లినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. అంతేకాదు ఈ నెల 28న బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం.













