రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కలకలం

తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసు నమోదు కావడం తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని ఒమిక్రాన్ పాజిటివ్ కేసు రావడంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. దుబాయి నుంచి వచ్చిన ఒక వ్యక్తికి ఒమిక్రాన్‌గా నిర్ధారణ అయింది. జిల్లా పరిధిలోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఈ నెల 16న దుబాయ్ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో కరోనా పరీక్షలు నిర్వహించగా వెంటనే ఆ వ్యక్తిని చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు. ఈ సంఘటనతో వైధ్యాధికారులు ఆప్రమత్తమై పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కాంటాక్ట్ ఉన్న వారి గూర్చి ఆరా తీసుకున్నారు. మొదటి సారి కొత్త వేరియంట్ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతుంది.