రాష్ట్రపతి నిలయంలో ఘనంగా తేనీటి విందు
సికింద్రాబాద్ బొల్లారంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఏర్పాటు చేసిన తేనీటి విందు ఘనంగా జరిగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దంపతులు, ముఖ్యమంత్రి కేసీఆర్, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఎన్వీ రమణ, ఆర్.సుభాష్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్లు దీనికి హాజరయ్యారు. రాష్ట్రపతి సతీమణి సవితా కోవింద్, కుమార్తె స్వాతి కోవింద్, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విందుకు వచ్చిన అతిథులను రాష్ట్రపతి దంపతులు ఆప్యాయంగా పలకరించారు.













