మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలి : రాష్ట్రపతి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పోరాటం, దేశ భక్తి అసమానమైనదని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకల ముగింపు కార్యక్రమం హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ నేతాజీ పోరాటం వలే అల్లూరి సీతారామరాజు పోరాటం కూడా ప్రజల్లో స్ఫూర్తి నింపింది. మహనీయుల చరిత్రను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలి. అల్లూరి ఒక ప్రత్యేకమైన యుద్ధ నైపుణ్యంతో ఆంగ్లేయులపై పోరాటం చేశారు అని రాష్ట్రపతి వివరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఏర్పాటు చేసిన అల్లూరి 30 అడుగుల కాంస్య విగ్రమం, స్మృతి వనాన్ని హైదరాబాద్ నుంచి రాష్ట్రపతి వర్చువల్గా ప్రారంభించారు.













