సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరిన పొన్నాల లక్ష్మయ్య
జనగామ వైద్యకళాశాల మైదానంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య బీఆర్ఎస్లో చేరారు. కేసీఆర్ ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పొన్నాల మాట్లాడుతూ కాంగ్రెస్లో 45ఏళ్లు ఉండి అవమానాలకు గురయ్యానని అన్నారు. ఎన్నికల నేపథ్యంలోనే పలు రాజకీయ పార్టీలు కులగణనను తెరమీదకు తీసుకొస్తున్నాయని అన్నారు. కానీ కేసీఆర్ సీఎం అయిన 3 నెలలకే కులగణన, సమగ్ర సర్వే చేపట్టారని గుర్తు చేశారు. జనగామ నియోజకవర్గంలో కేసీఆర్ 7 రిజర్వాయర్లు నిర్మించారని తెలిపారు. జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్ఎస్లో చేరానన్నారు. జనగామ జిల్లాకు మరింత ప్రోత్సాహకం ఇవ్వాలని, పాడిపారిశ్రమ అభివృద్ధికి సహకరించాలని సీఎం కేసీఆర్ను కోరారు.













