తెలంగాణకు మరో అంతర్జాతీయ ఖ్యాతి
తెలంగాణ రాష్ట్రానికి మరో అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది అని రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ నుంచి పోటీపడిన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి గ్రామం ఈ ఘటత సాధించినందుకు మంత్రి ఈ సందర్భంగా ఆ గ్రామ ప్రజలకు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో పర్యాటకాభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ నేతృత్వంలో కాకతీయుల కళా సంపద రామప్ప దేవాలయంకు యునెస్కో వారసత్వ కట్టడాల జాబితాలో గుర్తింపు లభించిందన్నారు.













