సీఎం రేవంత్ రెడ్డికి పీఎంఓ ఆహ్వానం

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 4, 5 తేదీలలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్న సందర్భంగా విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు ప్రధాని రాష్ట్ర పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియజేశారు. కాగా, 4, 5 తేదీలలో ఆదిలాబాద్, సంగారెడ్డిలో మోదీ పర్యటించనున్నారు.