ఎన్టీఆర్ భవన్ లో కాంగ్రెస్ కార్యకర్తల సందడి
రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే తొలిసారిగా ఎన్టీఆర్ భవన్లో కాంగ్రెస్ కార్యకర్తలు సందడి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహాకూటమి (కాంగ్రెస్) జుబ్లీహిల్స్ అభ్యర్థి విష్టువర్థన్రెడ్డి, తన అనుచరులతో కలిసి ఎన్టీఆర్ భవన్‌కు ర్యాలీగా వచ్చారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్, చంద్రబాబుకు మద్దతుగా కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం విష్టువర్థన్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబును కేసీఆర్ శత్రువులా చిత్రీకరిస్తున్నారని, ఇది సరికాదన్నారు. చంద్రబాబు, కాంగ్రెస్‌పై ఆయన హద్దులో ఉండి మాట్లాడాలని హెచ్చరించారు. కాగా, విష్ణుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు కూడా బైక్ ర్యాలీ తీశారు.













