కాంగ్రెస్ పార్టీకి మరో షాక్
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి షాక్‌ల మీద షాక్‌లు తగులుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల నాగేశ్వర్రావుపై గెలుపొందిన కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సిటు ఇస్తామని హామీ ఉపేందర్ రెడ్డికి లభించినట్టు సమాచారం. దీంతో త్వరలోనే ఆయన టీఆర్ఎస్లో చేరే అవకాశం కనబడుతోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ బీ ఫారంపై పోటీచేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత కొంత కాలంగా కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి.













