దేశంలోనే తెలంగాణగా మొదటి స్థానం…

కొవిడ్ 19 వ్యాక్సినేషన్‍లో తెలంగాణ రికార్డు సృష్టించింది. ఒక్కరోజులో 2 లక్షల డోసులు పంపిణీ చేసి దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటిస్థానంలో నిలిచింది. కరోనా వ్యాక్సినేషన్ పక్రియ జనవరి 16వ తేదీన ప్రారంభమైన తర్వాత తొలిసారిగా తెలంగాణలో అత్యధికంగా టీకాలు వేయడం ఇదే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ అధికార వర్గాల వివరాల ప్రకారం ఒక్కరోజులోనే రాష్ట్ర వ్యాప్తంగా 2,11,244 మందికి టీకాలు పంపిణి జరిగింది. ఇందులో 24,787 మందికి సెకండ్ డోస్ తీసుకోగా, 1,86,467 మంది తొలి డోస్ తీసుకున్నారు. దీంతో మొత్తంగా కరోనా టీకా 31,59,780 మంది తీసుకున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.