చంద్రబాబు అరెస్టుకు నిరసనగా.. ఉస్మానియా యూనివర్సిటీలో
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అరెస్టు ను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)లో విద్యార్థులు నిరసనకు దిగారు. చంద్రబాబు అభిమాన సంఘం జాతీయ అధ్యక్షుడు, ఓయూ పరిశోధక విద్యార్థి (పీహెచ్డీ) తలారి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ అప్రజాస్వామిక అరెస్టును చూడలేమంటూ కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గోపీ, నరేందర్, మల్లేష్, కృష్ణంరాజు, దిలీప్, వెంకటేష్, ప్రదీప్, మహాత్పాటు విద్యార్థులు పాల్గొన్నారు.













