తెలంగాణలో కరోనా విజృంభణ

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా కరోనా కేసులు రాష్ట్రంలో భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 54,534 కరోనా నమూనాలను పరీక్షించగా 1913 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల వ్యవధిలో రాష్ట్రంలో కరోనాతో ఇద్దరు మరణించారు. దీంతో ఇప్పటి వరకు కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయినవారి సంఖ్య 4036 కు చేరంది. ఒక్కరోజే 1,052 మంది కరోనా బారినపడితే.. కొత్తగా నమోదైన కేసులు దాదాపు 50 శాతం అధికమయ్యాయి. రాష్ట్రంలో 1,520 కరోనా కేసులు రికార్డయ్యాయి.
గ్రేటర్ హైదరాబాద్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 979 కేసులు వచ్చాయి. రంగారెడ్డి జిల్లాలో 176, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 132 మంది కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,168 యాక్టివ్ కేసులున్నాయి. 84 శాతం కేసులు జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల పరిధిలోనే నమోదవుతున్నాయి.