ఈనెల 25 నుంచి నుమాయిష్ ప్రారంభం

నుమాయిష్ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ నెల 25వ తేదీ నుంచి 46 రోజుల పాటు కొనసాగనుంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) పున ప్రారంభించేందుకు సొసైటీ పాలకవర్గం చర్యలు తీసుకుంటుంది. తాజాగా కొవిడ్ నిబంధనలను సడలించారు. దీంతో ఎగ్జిబిషన్ నిర్వహణపై సొసైటీ పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ నెల 25వ తేదీన ప్రారంభించి 46 రోజులపాటు ఎగ్జిబిషన్‌ను కొనసాగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ప్రభుత్వం నుంచి అధికారికంగా ఉత్తర్వులు అందగానే నుమాయిష్ ప్రారంభ తేదిని అధికారికంగా ప్రకటిస్తామని సొసైటీ సెక్రటరీ ఆదిత్యమార్గం తెలిపారు. ఈ సారి నుమాయిష్ 1,600 స్టాళ్లతో కొనసాగించేందుకు మైదానంలో ఏర్పాట్లు చేశారు. కరోనా వల్ల మూసేసినా స్టాళ్లను అలాగే ఉంచాయి. దీంతో సొసైటీ పాలకవర్గం మైదానంలో ఏర్పాటు చేసిన స్టాళ్ల నిర్వాహకులకు ఎగ్జిబిషన్‌ను తిరిగి ప్రారంభిస్తామని, తమ వస్తువులను తెచ్చుకోవచ్చని ఆహ్వానాలు, ఫోన్ మెసేజ్‌లను పంపుతున్నారు.