జనవరి 1 నుంచి నుమాయిష్
అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్)కు సమయం ఆసన్నమైంది. ఇందుకు సంబంధించి ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జనవరి 1న 83వ నమాయిష్ ప్రారంభానికి ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో పలు రాష్ట్రాల ఉత్పత్తులతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన పలు ఉత్పత్తులు, ప్రభుత్వాల స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు. ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15వ తేదీ వరకు 46 రోజుల పాటు కొనసాగనుంది. ఎగ్జిబిషన్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగాప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక్కడ సుమారు 2,400 స్టాళ్లు కొలువుదీరనున్నాయి.













