బలగం మొగిలయ్యకు ఎన్ఆర్ఐ చేయూత
అనారోగ్యంతో బాధపడుతున్న బలగం మొగిలయ్యకు ప్రవాస భారతీయుడు సంజయ్, అతని స్నేహితులు ఆర్థిక సాయం అందజేశారు. మొగిలయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్న సంజీవ్ అతడికి చేయూత అందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితులతో కలిసి 1.50 లక్షలు సేకరించి కూకట్పల్లిలో ఉంటున్న సంజీవ్ తల్లి ఉమాదేవి ఖాతాలో జమ చేశారు. నిమ్స్ ఆస్పత్రికి వచ్చిన ఉమాదేవి మొగిలయ్యకు నగదు అందజేశారు. మొగిలయ్య ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.













