న్యాయం గెలిచింది : లండన్‌లో సంబరాలు

ఢిల్లీ లిక్కర్ పాలసీతో ఏ మాత్రం సంబంధం లేకున్నా తమ పార్టీ ఎమ్మెల్సీ కవితపై ఈడీ అక్రమంగా కేసు బనాయించి 168 రోజులు అన్యాయంగా జైల్లో వేయించడం తీవ్ర బాధాకరమని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు. లిక్కర్ పాలసీతో ఆమెకు ఎలాంటి ప్రమేయం లేదని, ఇందుకు సంబంధించి ఆమె వద్ద నుంచి ఎలాంటి పత్రాలు, ఆధారాలు లభించలేదన్నారు. కేసులో దమ్ము లేదని అన్యాయంగా, అక్రమంగా బనాయించారని రాజకీయ ప్రేరేపిత కేసులో చివరకు న్యాయమే గెలిచిందని ఎన్నారై కోఆర్డినేటర్ మహేష్ బిగాల అన్నారు.
మరోవైపు ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు కావడం పట్ల లండన్ లో ఎన్నారైలు సంబరాలు చేసుకున్నారు. ఎన్నారై బీ.ఆర్.యస్ యూకే ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో బాణసాంచా కాల్చి, స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. కవితను అక్రమంగా జైల్లో పెట్టారని, ఆమెకు బెయిల్ ఇవ్వడం పట్ల సుప్రీంకోర్టుకు ఎన్నారై బీ.ఆర్.యస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం ధన్యవాదాలు తెలిపారు. నేడు బెయిల్ వచ్చిన విధంగానే తుది తీర్పులో కూడా కవిత నిర్దోషిగా బయటకు వస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రత్నాకర్ కడుదుల, రవి రేటినేని, సత్య చిలుముల మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.