నిమ్మగడ్డ ప్రసాద్‌కు హైకోర్టులో చుక్కెదురు

జగన్ అక్రమాస్తుల కేసులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. వాన్‌పిక్ ఛార్జిషీట్ నుంచి ఆయన పేరును తొలగించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఈ మేరకు నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్ వేసేందుకు అనుమతి ఇచ్చింది.