తెలంగాణలో క్తొగా 2,524 కేసులు..

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 87,110 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 2,524 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా మరో 18 మంది మరణించారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 3,281కి పెరిగింది. రాష్ట్రంలో ప్రస్తుతం 34,084 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇవాళ 3,464 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. జీహెచ్‍ఎంసీ పరిధిలో 307, నల్లగొండ జిల్లాలో 183, రంగారెడ్డి జిల్లాలో 142, ఖమ్మం జిల్లాలో 134, భదాద్రి కొత్తగూడెం జిల్లాల్లో 128 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.