నా రాజీనామాతోనే మునుగోడులో …
నా రాజీనామాతోనే మునుగోడు నియోజకవర్గంలో గట్టుప్పల్ను మండల కేంద్రంగా ఏర్పాటు చేశారని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్, ధర్మభిక్షం గౌడ్ విగ్రహాలకి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నా రాజీనామాతోనే కొత్త పింఛన్లు మంజూరు చేశారు. రోడ్లు బాగా చేశారు. ఈ నెల 21న బీజేపీ సభ ఉందని తెలిసినా టీఆర్ఎస్ 20వ తేదీన సభ పెట్టడం దుర్మార్గం. మునుగోడు నియోజకవర్గంలో ఇన్చార్జీలుగా నియమితులయిన ఎమ్మెల్యేలు వాళ్ల సొంత నియోజకవర్గంలో పింఛన్లు పంపిణీ చేయడం లేదన్నారు. మునుగోడులో జరిగే బీజేపీ సభకు వేల సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వస్తున్నారు అని తెలిపారు.













