ఎంపీ కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు.. రేపటి నుంచి తానేంటో చూపిస్తా
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లోని సీఎల్పీ కార్యాలయంలో పార్టీ సీనియర్ నేత వీహెచ్‌తో సమావేశమయ్యారు. అనంతరం కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ రేపటి నుంచి తానేంటో చూపిస్తానని అన్నారు. కామారెడ్డిలోని ఎల్లారెడ్డి నుంచి నా ఉద్యమం మొదలుపెడుతా. కాంగ్రెస్ తన ప్రాణమని తెలిపారు. సోనియాగాంధీ దేవత అని అన్నారు. పెద్ద లీడర్లు అని చెప్పుకొని పదవుల పంపకాలు చేసుకున్నారు. 72`78 సీట్లు వస్తాయని మంత్రులు, ముఖ్య మంత్రుల పదవులు పంపకాలు చేసుకున్నారు. నేను జిల్లా లీడర్‌ను, వాళ్లంతా పెద్ద గొప్ప లీడర్లు అని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ లేదనుకుంటే 6 వేల ఓట్లు వచ్చాయి. తెలంగాణలో ప్రభుత్వం వస్తదని చెప్పుకుంటే డిపాజిట్లు రాలే. కేటీఆర్ సూటు బూటు వేసుకుంటే పెట్టుబడులు రావు. కాంగ్రెస్ అభివృద్ధి వల్లే ఇప్పుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రిని చూసి కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి అని అన్నారు. కాంగ్రెస్ అంటే ప్రాణమిచ్చే వ్యక్తి వీహెచ్ అని, ఆయన లాంటి నేతలంటే తనకెంతో గౌరవమన్నారు. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ వస్తుందని ఎవరమైనా కలలోనైనా అనుకున్నామా అని వ్యాఖ్యానించారు.













