ఎమ్మెల్సీ రాములు నాయక్ పై వేటు
టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ రాములు నాయక్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు అధిష్టానం ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆయనపై వేటు వేసినట్లు అధిష్టానం సృష్టం చేసింది. రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వార్తలు వచ్చాయి. కుంతియాతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను ఆయన కలిసినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. దీన్ని ఆయన ఖండించకపోవడంతో ఆ వార్తలకు మరింత బలం చేకూరింది. దీంతో ఆయన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు టీఆర్ఎస్ ప్రకటించింది. రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీ తరపు అసెంబ్లీ పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది.













