రెండో డోసు తీసుకున్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

జనగామ జిల్లా దవాఖానలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కరోనా టీకా రెండో డోసు వేయించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి నుంచి సురక్షితంగా బయట పడవచ్చు అని తెలిపారు. ప్రతి ఒక్కరూ టీకా వేయించుకోవాలని సూచించారు. వ్యాక్సినేషన్‍పై ప్రజల్లో అపోహ ఉందన్నారు. ఇది సరైంది కాదని ఆయన తెలిపారు. మాస్కులు ధరిస్తూ శానిటైజ్ వాడుతూ, భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.