సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రశంసలు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రశంసలు కురిపించారు. ఉద్యోగ అభ్యర్థులను దృష్టిలో ఉంచుకొని 80,039 ఉద్యోగాలు నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ చేసిన ప్రకటనపై జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు. రేపు సీఎంను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతానని తెలిపారు. హౌసింగ్ విభాగాన్ని మళ్లీ తెరవాలని సీఎంను కోరుతానని వెల్లడించారు. బిస్వాల్ కమిటీ నివేదిక ప్రకారం మిగతా పోస్టులు భర్తీ చేయాలన్నారు. ఈ విషయంలో తమ పార్టీలో భిన్నాభిప్రాయలు లేవన్నారు. ఏడేండ్లుగా నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని పలుమార్లు విమర్శించాం. ఏ పార్టీ అయినా రాజకీయ లబ్ది లేకుండా పని చేయద్దని జగారెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్రంలో మంచి పనులు జరుగుతున్నాయంటే అందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీలే కారణమన్నారు.













