మిథాలీకి కోటీ నజరానా
మహిళల క్రికెట్ వరల్డ్ కప్ పోటీల్లో భారత జట్టును ఫైనల్‌కు చేర్చినందుకు, వ్యక్తి గతంగా అత్యధిక పరుగుల రికార్డు సృష్టించినందుకు కెప్టెన్ మిథాలీ రాజ్‌ను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అభినందించారు. హైదరాబాద్‌కు చేరుకున్న మిథాలీ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ శాలువా కప్పి మిథాలీని సన్మానించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. మిథాలీని అద్భుత క్రికెటర్‌గా తీర్చిదిద్దాలంటూ ప్రశంసించారు. వ్యక్తిగతంగా నా తరపున, తెలంగాణ ప్రజల తరపున మనసార అభినందనలు. నీకు అన్ని విధాల ప్రభుత్వం అండగా ఉంటుంది. అని మిథాలీ తో ముఖ్యమంత్రి అన్నారు. మిథాలీ రాజ్‌కు ప్రభుత్వం తరపున కోటీ రుపాయల నగదు ప్రోత్సాహాన్ని ముఖ్యమంత్రి ప్రకటించారు. మిథాలీకి బంజారాహిల్స్‌లో 600 గజాల నివాస స్థలాన్ని ఇవ్వనున్నట్లు ప్రకటించారు.













