మేడారం వెళ్లే వీఐపీలకు.. కీలక సూచన
మేడారం జాతరపై మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క సమీక్ష నిర్వహించారు. జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఎప్పటికప్పుడు జాతర వివరాలు సేకరిస్తూ, బడ్జెట్ కేటాయిస్తున్నట్లు మంత్రి సీతక్క వివరించారు. వీఐపీలు వారి వాహనాలను ములుగులో ఉంచి బస్సులో మేడారం వెళ్లాలని సూచించారు. జాతరకు ఖర్చు చేసే ప్రతి రూపాయి వివరాలు ప్రజల ముందుంచుతామన్నారు. సమ్మక్క`సారలమ్మ చరిత్రను శిలాశాసనం చేసి మేడారంలో ఏర్పాటు చేస్తామని సీతక్క తెలిపారు.













