కరోనా టీకా తీసుకున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగుతున్నది. ఇందులో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ కొవిడ్ టీకా తీసుకున్నారు. మహబూబ్‍నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో వ్యాక్సిన్ మొదటి డోసు వేయించుకున్నారు. మంత్రితో పాటు ఆయన తల్లి శాంతమ్మ, సోదరుడు శ్రీకాంత్ గౌడ్ కూడా వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు. టీకా పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.