డ్రైవర్ లెస్ కారు అద్భుతం : మంత్రి శ్రీధర్

సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ హైదరాబాద్‌ను తెలంగాణ మంత్రి శ్రీధర్‌బాబు సందర్శించారు. అక్కడి విద్యార్థులు రూపొందించిన డ్రైవర్ రహిత కారును పరిశీలించి అందులో ప్రయాణించారు. అనంతరం శ్రీధర్‌బాబు మీడియాతో మాట్లాడుతూ డ్రైవర్‌లెస్ కారు అద్భుతంగా ఉందని, దీన్ని రూపొందించిన హైదరాబాద్ ఐఐటీ దేశానికే గర్వకారణమని అన్నారు. ప్రయోగదశలో ఉన్న ఈ డ్రైవర్‌లెస్ సాంకేతికత త్వరలో ఆచరణలోకి రావాలని ఆకాంక్షించారు. ఏఐ సేవలను అన్ని రంగాల్లో వినియోగించుకుంటున్నట్లు తెలిపారు.