మంత్రి పువ్వాడకు కరోనా పాజిటివ్

తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‍కుమార్‍కు కరోనా పాజిటివ్‍గా తేలింది. స్వల్ప లక్షణాలు కన్పించడంతో ఆయన ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. దీంతో వెంటనే ఆయన ఖమ్మం నగరంలోని తన నివాస గృహంలో హోం ఐసోలేషన్‍కు వెళ్లారు. గతంలో కూడా కరోనా పాజిటివ్‍గా వచ్చింది. ఆ తరువాత పూర్తి స్థాయిలో నయం అయింది. ఇప్పుడు రెండో పర్యాయయం మళ్లీ కరోనా సోకింది. తనకు ఎలాంటి ఇబ్బంది లేదని, తనతో గడిచిన వారం రోజులుగా తనను కలిసిన వారు కూడా పరీక్షలు చేయించుకోని తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నాయకులు, కార్యక్తలు, అభిమానులు ఎవ్వరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని త్వరలో యథావిధిగా మీ మధ్యకు వచ్చి అన్ని కార్యాక్రమాల్లో పాల్గొంటానని అన్నారు.