ఏపీ సీఎంపై సంచలన వ్యాఖ్యలు చేసిన.. తెలంగాణ మంత్రి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఆరోజు ఆంధ్రోళ్లన్నారని, ఈ రోజు జగన్ బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అందుకే మోటార్లకు మీటర్లు పెడుతున్నారని విమర్శించారు. నిధులు లేక జగన్ కేంద్రాన్ని అడుక్కుతింటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వస్తే అడుక్కుతింటామని ఎద్దేవా చేసినవారే బిచ్చమెత్తుకుంటున్నారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నడవాలంటే కేంద్రం నిధులు కావాలన్నారు. కేంద్రం ఒత్తిడితోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మోటార్లకు మీటర్లు పెట్టారని తెలిపారు.













