అమెరికా పర్యటనలో మంత్రి నిరంజన్ రెడ్డి
వ్యవసాయరంగంలో పత్తిపంట సాగుకు ప్రపంచ దేశాల్లో ఇండియాలోని దక్కన్ పీఠభూమి అత్యంత అనుకూలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్‌లో బేయర్ పత్తి విత్తన పంట జెన్యూ పరిశోధన కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో ప్రధానమైన వాణిజ్య పంట పత్తి అని తెలిపారు. ఇది ప్రపంచ వస్త్ర పరిశ్రమకు మూలాధారమైన పంటగా పేర్కొన్నారు. ప్రపంచంలో పండే నాలుగు రకాల పత్తిపంటలో 90 శాతం పత్తిపంట గాసిపియం హిర్సూటం రకానికి చెందినదే అని తెలిపారు. ప్రపంచంలో అత్యధికంగా భారత్ నుండి సుమారు 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తి అవుతున్నట్లు తెలిపారు. భారత్‌తో పాటు ప్రధానంగా చైనా, అమెరికా దేశాల్లో ప్రతి పంట ఎక్కువగా సాగులో ఉన్నట్లు తెలిపారు. ఏటా 6.2 మిలియన్ టన్నుల పత్తి ఉత్పత్తిలో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని వెల్లడిరచారు.













