తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రవాసులు సహకారం : మంత్రి నిరంజన్ రెడ్డి
ఖండాలు దాటివచ్చినా జన్మభూమిని మరువొద్దని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న మంత్రి తెలంగాణ ఆసోసియేషన్ కార్యవర్గ సభ్యులతో సమావేశమయ్యారు. దేశంలోని ఇతర రాష్ట్రాలకు భిన్నంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పురోగమిస్తున్నదని తెలిపారు. ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్ ఏటా బతుకమ్మ సంబురాలు ఘనంగా జరుపడం అభినందనీయమని అన్నారు. తెలంగాణ పునర్నిర్మాణానికి ప్రవాసులు సహకారం అందించాలని కోరారు. ఏటీఏ ప్రెసిడెంట్ అనిల్ బైరెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కిరణ్ పాల్వాయి, పుల్లారెడ్డి, మహేశ్, అమరేందర్ రెడ్డి, దీపక్, మధు, కిశోర్, రాజవర్థన్, ఫణి, సతీశ్, ప్రవీణ్ దేశం, రవి దామర, కృష్ణ వడియాల, ప్రదీప్తి, అనిల్ రాఘవేంద్ర, రమేశ్, కార్తిక్ రవి సత్యనారాయణ, శ్రవణ్, రఘు తదితరులు పాల్గొన్నారు.













