డిసెంబర్ 3 తర్వాత.. అందరికి వచ్చేలా : మంత్రి కేటీఆర్
ఎన్నికల్లో ప్రజలు ఆలోచించి ఓటేయాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. వేములవాడ నియోజకవర్గం కథలాపూర్లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ డిసెంబర్ 3 తర్వాత అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. గతంలో విత్తనాలు, ఎరువుల కోసం లైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఉండేవి. కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు. ఎన్నికలు రాగానే సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు విపక్షాలు వస్తాయి. బీడీ కార్మికులకు పింఛను ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిది. ఇంకా కొంతమందికి పింఛను రావాలి. అందరికీ వచ్చేలా చూస్తాం. 65 ఏళ్లలో కాంగ్రెస్, బీజేపీ చేయని పనులను బీఆర్ఎస్ పూర్తి చేసింది అని అన్నారు.













