తెలంగాణ పోలీసులపై.. మంత్రి కేటీఆర్

తెలంగాణ పోలీసులపై మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. కరోనా కష్టకాలం లోనూ విరామం లేకుండా పనిచేస్తున్నారని కొనియాడారు. కరోనా నివారణకు వినియోగించే మెడిసిన్స్, ఆక్సిజన్ సిలిండర్లను బ్లాక్ మార్కెటింగ్‍కు పాల్పడుతున్న వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ తమవంతు కృషి చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. కరోనా సెకండ్ వేవ్‍లో పలు రకాల మందులు బ్లాక్ మార్కెట్‍లో అమ్ముతున్న వారిపై పోలీసులు ఇప్పటివరకు 128 కేసులు నమోదు చేశారని, 258 మందిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. బ్లాక్ మార్కెట్ దండాపై ఫిర్యాదు చేయాలనుకునే వారు 100 కు డయల్ చేయవచ్చని, తెలంగాణ డీజీపీకి నేరుగా ట్వీట్ చేయవచ్చని కేటీఆర్ సూచించారు.