మంత్రి కేటీఆర్కు గాయం…మూడు వారాల పాటు విశ్రాంతి
టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎడమ కాలికి గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని కేటీఆర్కు వైద్యులు సూచించారు. ఈ మేరకు కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. ఇవాళ కింద పడిపోయాను. దీంతో ఎడమ కాలి మడమకు గాయమైంది. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ సమయంలో విలువైన ఓటీటీ షోల గురించి ఎవరైనా సలహా ఇవ్వండి అని కేటీఆర్ తెలిపారు. కాలికి కట్టుతో ఉన్న ఫొటోను కేటీఆర్ ట్వీటర్లో పోస్టు చేశారు.
కాగా రేపు ఆదివారం (జూలై 24న)న మంత్రి కేటీఆర్ పుట్టిన రోజు. బర్త్డే కు ఒక రోజు ముందే గాయపడటంతో అభిమానులు, టీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి తొందరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు మంత్రి కేటీఆర్ వెల్లడిరచిన విషయం తెలిసిందే. భారీ వర్షాలు, పలు జిల్లాల్లో వరదల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారని.. వారికి పార్టీ శ్రేణులు తమకు తోచిన మేరకు గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం కింద సహాయం చేయాలని పిలుపునిచ్చారు.













