టీఆర్ఎస్ ను వీడితే వారికే నష్టం తప్ప… పార్టీకేం

మాజీ మంత్రి ఈటల రాజేందర్‍పై రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి ఫైర్ అయ్యారు. బీజేపీలో చేరిన ఈటలకు కేసీఆర్ విమర్శించే అర్హత లేదన్నారు. ప్రత్యేక ఏజెండాతోనే ఈటల రాజేందర్ బీజేపీలో చేరారు. బీజేపీతో పాటు రాజేందర్ కూడా మునిగిపోవడం ఖాయం అన్నారు. రాజకీయాల్లో విబేధాలు రావడం సహజమన్నారు. ఈటల మునిగిపోయే పడవ ఎక్కుతున్నారు. నియోజకవర్గ ప్రజలను ఈటల మోసం చేశాడు. బీసీలకు బీజేపీ చేసిందేమిటని ఈటల పలుసార్లు పశ్నించారు. టీఆర్‍ఎస్ కంటే బీజేపీలో ఏం మంచి చూసి చేరాడో ఈటలకే తెలియాలన్నారు.
ఈటల చెప్పే మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. ఆరోపణలపై విచారణ పూర్తయ్యే వరకు ఈటల టీఆర్‍ఎస్‍లో ఉండాల్సింది. టీఆర్‍ఎస్‍ను వీడితే వారికే నష్టం తప్ప తమ పార్టీకేం కాదని స్పష్టం చేశారు. గుంపును వదిలి అడవిలోకి పోతే మృగాల పాలవుతారు. అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణ దూసుకుపోతోంది. ఏ రాష్ట్రం కూడా తెలంగాణతో పోటీ పడే పరిస్థితి లేదు అని స్పష్టం చేశారు. బీజేపీ హిట్లర్ పార్టీ అని గతంలో ఈటల చెప్పారనీ, కేంద్రం తీసుకొచ్చిన రైతు చట్టాలను నల్ల చట్టాలుగా అభివర్ణించిన ఆయన మా•లకు, చేతలకు పొంతనలేదని అన్నారు.