ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరు కానీ… సీఎం అవుతా అంటున్నారు
బీఆర్ఎస్ హయాంలో కర్ఫ్యూలేని తెలంగాణ చూస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డిలో ముస్లిం మైనారిటీల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్‌ను ఆశీర్వదించడానికి వచ్చిన ముస్లిం సోదరులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ మైనారిటీ రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. షాదీముబారక్ పథకం అమలు చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. సదాశివపేటలో కబరిస్తాన్ కోసం 5 ఎకరాలు ఇచ్చాం. మైనారిటీ విద్యార్థులకు పోషకాహారం అందిస్తున్నాం. 17వేల మంది ఇమామ్‌లకు రూ.5వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తున్నాం. ఓడినా చింతా ప్రభాకర్ సంగారెడ్డి ప్రజల మధ్యలోనే ఉన్నారు. సీఎం కేసీఆర్ సంగారెడ్డికి మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ ఇచ్చారు. రూ.2 కోట్లతో సంగారెడ్డి, సదాశివపేటలో మైనారిటీలకు షాదీఖానా నిర్మిస్తాం. జగ్గారెడ్డి సీఎం అవుతా అంటున్నారు. ఆయన ఎమ్మెల్యేగా కూడా గెలవరు. జానారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయట్లేదు కానీ, సీఎం అవుతా అంటున్నారు. కాంగ్రెస్ పార్టీలో 10 మంది సీఎంలు ఉన్నారు అని ఎద్దేవా చేశారు.













