5 నుంచి మేడారం మహాజాతర
దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్దికెక్కిన మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజాతరకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను సిద్దం చేస్తోంది. ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు జరిగే ఈ జాతర తెలంగాణ కుంభ మేళాగా చెప్పుకునే జాతారను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లను చేస్తున్నారు. కోటీ మందికి పైగా భక్తులు వస్తారనే అంచనాతో 21 శాఖల ద్వారా రూ.75 కోట్లు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్ర పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, గిరిజన స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పరిశీలిస్తూ అధికారులతో సమీక్షలు చేస్తూ పనులను వేగవంతం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, ప్రతి రోజు జాతర అభివృద్ది పై టెలీకాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారరు. ప్రభుత్వం ఇంతా చేస్తున్నా కొన్ని శాఖల అధికారుల పనితీరు జాతరకు మచ్చ తెచ్చే ప్రమాదం ఉంది. మహాజాతరకు మరో నాలుగు రోజుల వ్యవధి మాత్రమే ఉన్నప్పటికీ ఇంకా పనులను పూర్తి చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు అలసత్యం వహించడం వలన భక్తులు ఇబ్బందులు పడనున్నారు.













