రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మందా జగన్నాథం బాధ్యతల స్వీకరణ
ఢిల్లీ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నాగర్కర్నూల్ మాజీ ఎంపీ, టీఆర్ఎస్ నాయకులు మందా జగన్నాథం బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీ లోని తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ సమక్షంలో జగన్నాథం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండోసారి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా తనకు అవకాశం ఇచ్చిన సీఎం కేసీఆర్కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మధ్య సంధాన కర్తగా పనిచేసి రాష్రానికి విరివిగా నిధులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తానని స్పష్టం చేశారు. రాష్ట్రానికి సంబంధించిన సమస్యలను, పెండిరగ్ ఇష్యూస్ ని కేంద్ర ప్రభుత్వం దగ్గరకు ఎప్పటికప్పుడు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.













