భారత్ అబ్బాయి.. లండన్ అమ్మాయి

తెలంగాణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు, లండన్‌కు చెందిన డయానాని వివాహమాడారు. బెల్లంపల్లి పట్టణంలోని ఓ కల్యాణ మండపంలో హిందూ సంప్రదాయ ప్రకారం ఇద్దరూ ఒక్కటయ్యారు. రాజు గత మూడేళ్లుగా లండన్‌లో వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో డయానాతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. భారత్‌లోనే పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక మేరకు స్థానిక ఆచారం ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. వివిధ కారణాల వల్ల లండన్ నుంచి వధువు తల్లిదండ్రులు రాలేకపోవడంతో బెల్లంపల్లికి చెందిన ముత్తె వెంకటేశ్, లావణ్య దంపతులు కక్యాదానం చేశారు. వివాహానికి హాజరైన వారంతా నూతన దంపతులను ఆశీర్వదించారు.